సిద్ధ గవ్య ఆయుర్వేదం 

మన భారతదేశం లో ఆయుర్వేదం అనేది అతి పురాతనమైన సిద్ధ వైద్యం. ఎందరో యోగి పుంగవలు,  మహనీయులు ఆచరించి తరించారు,  కాలక్రమేణా తరువాత ఇంగ్లిష్ వైద్య విధానం వచ్చినిది, కానీ ఇప్పుడు ఆ ఇంగ్లిష్ వారే తిరిగి ఆయుర్వేదం చాలా శక్తీ వంతం అని తీసుకొని వాళ్ళు కూడా భారతీయ సంప్రదాయాలను ఆచరిస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఆయుర్వేదo తిరిగి ప్రపంచం నలుమూలల పూర్వోన్నతిని పొందబోతున్నది. 

ఆయుర్వేదము ఆయుష్సును వృద్ధి చేయుటయేగాక కాయసిద్దిని కలిగించును 

మహోన్నత భారతీయ ఆయుర్వేద శాస్త్ర పద్దతి అనుసరించి మనకు అందుబాటులో వున్నా పూలు, పళ్ళు, ఆకులు, మొక్కలు,  కాయలు,  వేర్లు, దుంపలు లతో  చాలా సులభంగా మన ఆరోగ్యాన్ని మనమే పెంపొందించు కోనేలా మన పూర్వికులు, సిద్దులు, ఋషులు  ఆదర్వన వేదంలో  భాగముగా వున్నా వైద్య శాస్త్రం “ఆయుర్వేదం” అను పేరా ధన్వన్తరీ,  అశ్వని దేవతలు,  చరకుడు గల మహనీయులు అనేకరకమైన ఆయుర్వేదశాస్త్రములను వెలువరించి, ప్రపంచ మానవాళికి అందించి మహోపకారం మోనారించినారు. 

ప్రతి గృహము కూడా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్యశముతో మన ఈ సిద్ధ గవ్య బ్లాగ్ వెబ్సైటు ను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. 

గృహము లో దొరికే చిన్న చిన్న ఉపాయలతో,  పెరటిలో దొరికే మొక్కలతో, పది మంది ఆరోగ్యాంగా బాగుపడాలనే ఉద్యేశాముతో, అన్ని రకాల పురాతన రహస్యాలును ఇక్కడ అందిస్తున్నాము. 

గమనిక :

ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను  అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే,  ఆరోగ్యానికి సంబందించిన ఈ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.