Press ESC to close

Siddha gavyaSiddha gavya 100% Natural & Cure

రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదా? Sleeping tips

నిద్రలేమి సమస్య మిమ్మల్ని ఎందుకు వేదిస్తుంది? 

ప్రస్తుతం చాల మంది నిద్రలేమి సమస్య తో బాధపడుతున్నారు.రాత్రి గంటలు గంటలు బెడ్ పై పడుకున్న నిద్ర అనేది రాదు ఎదో ఆలోచించడం తప్ప నిద్ర మాత్రం రాదు. పని ఒత్తిడ్లు వలన,  కుటంబ సమస్యలు వలన టెన్షన్ పడుతుంది దాని వలన కూడా నిద్ర రాదు,  ఇలా అని మనం అశ్రద్ధ చేయకూడదు అలాని గాబరా పడకూడదు.

ఈ సమస్య నుండి బయట పడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. మీరు భోజనం చేసాక వెంటనే నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి,  తిన్న వెంటనే నిద్ర పోతే తిన్నది అరగక గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది,  అలాగే మలబద్దక సమస్య స్టార్ట్ అవుతుంది. మలబద్దకం వలన అనేక రోగాలు దాపురిస్తాయి.కొన్ని సార్లుతలతిరగడం వంట్లో వికారంగాఉండటం , కడుపు బరువుగా ఉండటం, సుఖ విరోచనాం కూడా కాదు, భోజనం తిన్నాక వెంటనే వాకింగ్ చేయాలి ఇలా చేయడం వలన  శరీరం అలిసిపోయి తొందరగా గాఢ నిద్ర పడుతుంది,  భోజనం చేసాక కనీసం రెండు గంటలు గ్యాప్ అనేది అవసరం.

నిద్ర పోయే ముందు గ్లాస్ దేశి ఆవు పాలు తాగండి మంచి గాఢ నిద్ర పడుతుంది ఎందుకంటే ఇందులో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి మంచి నిద్ర అనేది పడుతుంది. 
గాఢమైన నిద్రపట్టలంటే బాధంపాలు కూడా తీసుకోవచ్చు. 

మీకు నిద్ర కరువైతే గ్లాసు గోరువెచ్చని పాలల్లో పావు స్పున్ పసుపు ముద్దని గాని, పసుపు పొడిని గాని కలిపి తీసుకోవచ్చు, దీని వలన గాఢ నిద్ర అనేది వస్తుంది,  అలాగే శరీరానికి విశ్రాంతిని ఇస్తుపడిపోయిమానా ఆరోగ్యాన్ని మనం నిర్లక్యం చేస్తున్నాము, ఒకసారి ఆరోగ్యం చెడిపోయిందా మనల్ని ఎవరు రక్షించలేరు తిరిగి మనవైపు చూసి పదిమంది నవ్వుతారు.  చాలామంది నైట్ డ్యూటీలు అని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక అనేక జబ్బుల బారిన పడుతూ వుంటారు. 

నిద్ర కనుక దూరమైతే భవిష్యత్తులో గుండె జబ్బులు, మధుమేహం, ఉబకాయం అనే దీర్ఘకాల రోగాలు వెంట వెంటనే వస్తాయి. వీలైనంత తొందరగా నిద్రపోవడానికి ట్రై చేయండి, టీవీలు చూడడటం వలన కళ్ళు ఎరుపెక్కీ నిద్ర అనేది సరిగ్గా రాదు.  రాత్రుళ్ళు గంటలు గంటలు సెల్ ఫోన్స్  లో సినిమాలు చూసి తమ తమ ఆరోగ్యాలను నాసినం చేసుకోకండి దీనివల్ల కళ్ళు తొందరగా పోయే ప్రమాదం వుంది కనుక,  వేగంగా నిద్ర పోతే చాలా మంచిది. అలాగే వ్యయమాలు ఆసనాలు,  ధ్యానం,  మంచి చిన్న సౌండ్ లో పెట్టిన మ్యూజిక్  వినడం వలన తెలికుండానే నిద్ర లోకి జారుకుంటారు. 

ఈ క్రింది విధివిధానాలు పాటిస్తే గాఢ నిద్ర మీ సొంతం 

1 నైట్ నిద్ర  పట్టకపోతే గసగసాలు పిడకెడు తీసుకోని వేడిచేసి గుడ్డలో మూట కట్టి వాసన చూస్తువుంటే తెలికుండానే నిద్రలోకి జారుకుంటారు. 

2 పడుకునేటప్పుడు గోరు వెచ్చని పాలల్లో నువ్వుల నూనె ఒక స్పున్ వేసి త్రాగినట్టు ఐతే గాడ నిద్ర వస్తుంది. పాలల్లో పసుపు కలిపి తగిన గాఢ నిద్ర మీ సొంతం. 

గమనిక :

ఆరోగ్య నిపుణుల అధ్యయనల ప్రకారం ఇక్కడ ఈ వివరాలను  అందించడం జరిగింది.ఈ కధనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే,  ఆరోగ్యానికి సంబందించిన ఈ చిన్న సమస్య ఉన్న అశ్రద్ధ చూపకుండా వెంటనే మీ దగ్గరలో వుండే వైద్యుడ్ని సప్రందించగలరు, ఇదే ఉత్తమమైన మార్గము.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *